*మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉధృతం చేస్తాం*
హైదరాబాద్: మే 10 (ఈతరమ్): దేశంలో మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కనుమరుగు చేసే పాలకుల కుట్రలను తమ ఆందోళనలతో అడ్డుకుంటామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) సంఘాలు హెచ్చరించాయి. జర్నలిస్టుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణిని నిరసిస్తూ ఐజేయూ పిలుపు మేరకు జాతీయ స్థాయి "జర్నలిస్ట్స్ డిమాండ్స్ డే" కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు విద్యానగర్ లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు టీయుడబ్ల్యుజె ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్బంగా ఐజేయూ జాతీయ అధ్యక్షులుకే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం మీడియా రంగాన్ని విస్మరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం సహించారనిదన్నారు. దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలపై జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా, జర్నలిస్టులు హత్యలకు గురవుతున్నా కేంద్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం విచారకరమన్నారు. ఇందుక...