డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌ పై అంతర్జాతీయ కోర్సు-జిఎస్ఐటిఐ

హైదరాబాద్, నవంబర్ 22,(ఈతరమ్) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (జిఎస్ఐటిఐ), హైదరాబాద్ జియో సైంటిస్ట్‌ల కోసం రిమోట్ సెన్సింగ్ మరియు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌ పై 12వ అంతర్జాతీయ కోర్సును నిర్వహిస్తోందిదీనిని 22 నవంబర్ 2022న హైదరాబాద్‌లోని జిఎస్ఐటిఐ కార్యాలయం లో శ్రీ సి.హెచ్. వెంకటేశ్వరరావుడిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు హెడ్ మిషన్-V అధ్యక్షతన  ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ మాథ్యూ జోసెఫ్డిప్యూటీ డైరెక్టర్ జనరల్శ్రీ యస్పి భూటియాడైరెక్టర్ (టెక్నికల్ కోఆర్డినేషన్)డాక్టర్ నిషా రాణిడైరెక్టర్ (కోర్సు కోఆర్డినేటర్), అధ్యాపకులు మరియు వివిధ దేశాల నుండి వచ్చినా ప్రముఖులు పాల్గొన్నారుభారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖచే స్పాన్సర్ చేయబడిన ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ITEC) కార్యక్రమం క్రింద ఈ శిక్షణా కోర్సు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే వృత్తిపరమైన నైపుణ్యాన్ని సృష్టించడానికి సాంకేతికతను పంచుకోవడం ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన లక్ష్యం. 15 (పదిహేను) ITEC దేశాలు (అల్జీరియాబంగ్లాదేశ్డొమినికన్ రిపబ్లిక్ఇథియోపియాగయానాకెన్యామలావిమారిషస్మయన్మార్నేపాల్నికరాగ్వాశ్రీలంకసూడాన్టాంజానియా మరియు టోగో) నుండి 15 మంది తేదీ నవంబర్ 22వ 2022 నుండి 20 డిసెంబర్ 2022 వరకు కోర్సుకు హాజరు కానున్నారు. 

స్వాగత ప్రసంగంలో శ్రీ సి.హెచ్. వెంకటేశ్వరరావుడిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు హెడ్ మిషన్-మాట్లాడుతూ  భూవిజ్ఞాన శాస్త్రంగనులపర్యావరణపట్టణ ప్రణాళిక మొదలైనవాటిలో ఉపయోగపడే అధునాతన టెక్నాలజీలో అత్యాధునిక సాంకేతికతను నేర్చుకునేందుకు శిక్షణలో పాల్గొనే అవకాశం ఉందని నొక్కి చెప్పారు. వివిధ దేశాల నుండి పాల్గొనేవారి జ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ శిక్షణ సహాయపడుతుంది. జ్ఞానంతో సహా భారతీయ సంస్కృతి మరియు నాగరికత గురించి తెలుసుకునే అవకాశం వారికి లభిస్తుంది. ప్రారంభోత్సవం సందర్భంగా పాల్గొనేవారికి స్వాగత జ్ఞాపిక ను అందించారు.

ఈ కోర్సులో పాల్గొనేవారికి రిమోట్ సెన్సింగ్ మరియు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అందించబడుతుందితద్వారా ఈ పద్ధతులను వారి సంబంధిత రంగంలో సమర్థవంతంగా వర్తింపజేయవచ్చు. దీని ద్వారాభారతదేశం తన సామాజిక ఆర్థిక అభివృద్ధి మరియు సాంకేతిక విజయాల ఫలాలను ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడం జరుగుతుంది.(PIB)

Popular posts from this blog

*మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉధృతం చేస్తాం*

కీలక అంశాలపై ఐజేయూకార్యవర్గం- సుదీర్ఘ చర్చ