సూర్యనమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం – గోపీచంద్

హైదరాబాదు,  నవంబరు 2022. సూర్యనమస్కారాలు, ధ్యానం మన శరీరాన్ని, మనసును ఆరోగ్యవంతం చేస్తాయని ప్రముఖ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. నగరంలోని హైటెక్స్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన సూర్యనమస్కారాల ఛాలెంజ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రము కళాశాలలు, కార్పొరేట్ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3500 మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 
యోగథాన్ లో పాల్గొన్న తెలంగాణా హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ మాట్లాడుతూ, 2050 సంవత్సరం నాటికి భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని, ఈ ప్రస్థానంలో మన దేశపు యువత ప్రధాన పోషించనున్నారని తెలిపారు. అటువంటి యువత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ప్రతీరోజూ యోగా తప్పక చేయాలని సూచిస్తూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపట్టిన ఈ యోగథాన్ కార్యక్రమం యువతలో కొత్త స్ఫూర్తిని నింపిదని అన్నారు.
18 నుండి 75 సంవత్సరాల వయసువారు సైతం ఉత్సాహంగా హాజరైన ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు చెందిన ప్రముఖ యోగా శిక్షకుడు, శ్రీశ్రీ యోగా స్కూల్ డైరెక్టర్ శ్రీ మయూర్ కార్తిక్, బృందం సూర్యనమస్కారాలు, ధ్యానం చేయించారు.

 నగరవాసులను ఆకట్టుకున్నయోగథాన్ – 108 సూర్య నమస్కారాల ఛాలెంజ్బాడ్మింటన్ కోచ్ గోపీచంద్, ప్రముఖ కార్పొరేట్ సంస్థలు, కళాశాల విద్యార్థుల సందడి


నగరంలోని ప్రముఖ కళాశాలలైన వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉస్మానియా వైద్యకళాశాల, ఎమ్.జి.ఐ.టి., నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, వి.ఎన్.ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల, సి.బి.ఐ.టి., ట్రిపుల్ ఐటీ, బిట్స్, ప్రభుత్వ ఆయుర్వేత కళాశాల, జాతీయ పౌష్టికాహార సంస్థ, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల, ఏకం ఐ.ఎ.ఎస్ అకాడమీ తదితర సంస్థలనుండి అనేకమంది ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు. వీరితోబాటు సింక్రొనీ, భారతీయ స్టేట్ బ్యాంకు, సుఖి గ్రూప్ సంస్థలు, రెయిన్ బో హాస్పిటల్స్, యశోదా హాస్పిటల్స్, శ్రీశ్రీ టాటూ, వే2న్యూస్, అనేక ఇతర కార్పొరేట్ సంస్థలనుండి ఉద్యోగులు, ప్రతినిధులు పాల్గొన్నారు. 
యోగథాన్ లో పేర్లు నమోదు చేసుకుని 108 సూర్యనమస్కారాలు విజయవంతంగా పూర్తిచేసినవారికి గోల్డ్ సర్టిఫికెట్, 54సార్లు చేసినవారికి సిల్వర్ సర్టిఫికెట్, పాల్గొనే వారందరికీ సర్టిఫికెట్లు అందచేస్తున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా వారందరికీ షర్టులు, యోగా మ్యాట్లు, హైటెక్స్ ప్రాంగణంలోఉచితంగా అందజేశారు. 
శారీరక మానసిక ఆరోగ్యం కోసం నిరంతరం యోగా చేయటాన్ని అలవాటుగా మార్చే నిమిత్తం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హైదరాబాద్ ప్రజలకు, ఆహ్వానితులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అపెక్స్ సభ్యుడు కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇటువంటి ఉత్సవాలనూ మరిన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 
ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ప్రతి వారమూ యోగా శిక్షణ కొనసాగించి, యోగసాధన ద్వారా ఆరోగ్యాన్ని ఒక అలవాటుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని నిర్వాహకులు తెలిపారు. 
ఈ కార్యక్రమపు ఫోటోలకు ఈ క్రింది లంకెను చూడండి.

Popular posts from this blog

*మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉధృతం చేస్తాం*

కీలక అంశాలపై ఐజేయూకార్యవర్గం- సుదీర్ఘ చర్చ