IJU జాతీయ మహాసభలను విజయవంతం చేద్దాం- ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్ణయం

 

అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో చెన్నై లో తమ సంఘం జాతీయ మహాసభలను విజయవంతంగా నిర్వహించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్ణయించింది.

మంగళవారం నాడు లకడికాపూల్ లోని ది సెంట్ హోటల్ లో ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. దేశంలో అత్యధిక రాష్ట్రాలు, జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ సంఘం 10వ ప్లీనరీకి చెన్నై వేదిక కానున్నట్లు ఐజేయూ జాతీయ బాధ్యులు తెలిపారు. 26 రాష్ట్రాల జాతీయ కౌన్సిల్ సభ్యులు ఈ ప్లీనరీలో పాల్గొననున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రులతో పాటు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆ రాష్ట్ర మంత్రులను ప్లీనరీకి ఆహ్వానించనున్నట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా తమిళనాడు వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు సుభాష్ ప్లీనరీ ఏర్పాట్లను సమావేశంలో వివరించారు. ఇవ్వాళ జరిగిన సమావేశంలో ఐజేయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్ము, ఐజేయూ జాతీయ మాజీ అధ్యక్షులు, ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జాతీయ బాధ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) అతిథ్యమిచ్చింది.











Popular posts from this blog

*మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉధృతం చేస్తాం*

కీలక అంశాలపై ఐజేయూకార్యవర్గం- సుదీర్ఘ చర్చ