Posts
ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
- Get link
- X
- Other Apps
By
Telanganadateline
-
ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోవా లో ఈ రోజు న ప్రారంభించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2024 అనేది భారతదేశం యొక్క అతి పెద్దది అయినటువంటి మరియు సర్వతోముఖమైనటువంటి శక్తి సంబంధి ఏకైక ప్రదర్శన , ఇంకా సమావేశం అని చెప్పాలి. శక్తి పరం గా పరివర్తన కై భారతదేశం నిర్దేశించుకొన్న లక్ష్యాల కు ఉత్ప్రేరకం గా ఉండేటట్టు ఎనర్జీ వేల్యూ చైన్ లోని వేరు వేరు భాగాల ను ఒక చోటు కు చేర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానోద్దేశ్యం గా ఉంది. గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ సిఇఒ లతో మరియు నిపుణుల తో ఒక రౌండ్ టేబుల్ ను కూడా ప్రధాన మంత్రి నిర్వహించారు. సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ , ప్రతి ఒక్కరి కి ఇండియా ఎనర్జీ వీక్ యొక్క రెండో సంచిక లో పాలుపంచుకోవడానికి ఇదే ఆహ్వానం అన్నారు. ఈ కార్యక్రమం శక్తి భరితం అయినటువంటి గోవా రాష్ట్రం లో జరుగుతూ ఉన్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. గోవా ఆతిథేయ భావన కు , ప్రాకృతిక శోభ కు పేరు తెచ్చుకొన్న రాష్ట్రం ; ఇక్కడి సంస్కృతి యావత్తు ప్రపంచం నుండి తరలి వచ్చేటటువంటి పర్యటకుల పై...
డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ పై అంతర్జాతీయ కోర్సు-జిఎస్ఐటిఐ
- Get link
- X
- Other Apps
By
Telanganadateline
-
హైదరాబాద్, నవంబర్ 22, ( ఈతరమ్) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (జిఎస్ఐటిఐ ), హైదరాబాద్ జియో సైంటిస్ట్‌ల కోసం రిమోట్ సెన్సింగ్ మరియు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ పై 12 వ అంతర్జాతీయ కోర్సును నిర్వహిస్తోంది , దీనిని 22 నవంబర్ 2022 న హైదరాబాద్‌లోని జిఎస్ఐటిఐ కార్యాలయం లో శ్రీ సి.హెచ్. వెంకటేశ్వరరావు , డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు హెడ్ మిషన్- V అధ్యక్షతన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాథ్యూ జోసెఫ్ , డిప్యూటీ డైరెక్టర్ జనరల్ , శ్రీ యస్పి భూటియా , డైరెక్టర్ (టెక్నికల్ కోఆర్డినేషన్) , డాక్టర్ నిషా రాణి , డైరెక్టర్ (కోర్సు కోఆర్డినేటర్), అధ్యాపకులు మరియు వివిధ దేశాల నుండి వచ్చినా ప్రముఖులు పాల్గొన్నారు . భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖచే స్పాన్సర్ చేయబడిన ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ( ITEC) కార్యక్రమం క్రింద ఈ శిక్షణా కోర్సు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధిక...
సూర్యనమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం – గోపీచంద్
- Get link
- X
- Other Apps
By
Telanganadateline
-

హైదరాబాదు, నవంబరు 2022. సూర్యనమస్కారాలు, ధ్యానం మన శరీరాన్ని, మనసును ఆరోగ్యవంతం చేస్తాయని ప్రముఖ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. నగరంలోని హైటెక్స్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన సూర్యనమస్కారాల ఛాలెంజ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రము కళాశాలలు, కార్పొరేట్ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3500 మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగథాన్ లో పాల్గొన్న తెలంగాణా హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ మాట్లాడుతూ, 2050 సంవత్సరం నాటికి భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని, ఈ ప్రస్థానంలో మన దేశపు యువత ప్రధాన పోషించనున్నారని తెలిపారు. అటువంటి యువత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ప్రతీరోజూ యోగా తప్పక చేయాలని సూచిస్తూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపట్టిన ఈ యోగథాన్ కార్యక్రమం యువతలో కొత్త స్ఫూర్తిని నింపిదని అన్నారు. 18 నుండి 75 సంవత్సరాల వయసువారు సైతం ఉత్సాహంగా హాజరైన ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు చెందిన ప్రముఖ యోగా శిక్షకుడు, శ్రీశ్రీ యోగా స్కూల్ డైరెక్టర్ శ్రీ మయూర్ కార్తి...
IJU జాతీయ మహాసభలను విజయవంతం చేద్దాం- ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్ణయం
- Get link
- X
- Other Apps
By
Telanganadateline
-

అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో చెన్నై లో తమ సంఘం జాతీయ మహాసభలను విజయవంతంగా నిర్వహించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్ణయించింది. మంగళవారం నాడు లకడికాపూల్ లోని ది సెంట్ హోటల్ లో ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. దేశంలో అత్యధిక రాష్ట్రాలు, జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ సంఘం 10వ ప్లీనరీకి చెన్నై వేదిక కానున్నట్లు ఐజేయూ జాతీయ బాధ్యులు తెలిపారు. 26 రాష్ట్రాల జాతీయ కౌన్సిల్ సభ్యులు ఈ ప్లీనరీలో పాల్గొననున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రులతో పాటు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆ రాష్ట్ర మంత్రులను ప్లీనరీకి ఆహ్వానించనున్నట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా తమిళనాడు వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు సుభాష్ ప్లీనరీ ఏర్పాట్లను సమావేశంలో వివరించారు. ఇవ్వాళ జరిగిన సమావేశంలో ఐజేయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్ము, ఐజేయూ జాతీయ మాజీ అధ్యక్షులు, ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలతో పాటు దేశంలోని...
ఉర్దూ జర్నలిజం ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిద్దాం
- Get link
- X
- Other Apps
By
Telanganadateline
-
ప్రపంచ వ్యాప్తంగా ఘన చరిత్ర కలిగి ఉన్న ఉర్దూ జర్నలిజానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో హైదరాబాద్ కేంద్రంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లపై ఇవ్వాళ మినిస్టర్స్ క్వార్టర్స్ లోని మంత్రి నివాసంలో ముఖ్యులతో నిర్వహించిన సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడారు. దేశంలో ఉర్దూ జర్నలిజం 200 ఏళ్ళు పూర్తి చేసుకోవడం శుభ పరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ లో టీయూడబ్ల్యూజేఎఫ్ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉర్దూ భాష పై ఉన్న పట్టు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదన్నారు. ఈ ఉత్సవాలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రెండు రోజుల పాటు రవీంద్రభారతీలో ఈ ఉత్సవాలను నిర్వహించే విషయంలో తాను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని మహమూద్ అలీ స్పష్టం చేశారు. వెంటనే ఉత్సవాల సన్నాహక కమిటీని నియమించు కోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ అల...
*మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉధృతం చేస్తాం*
- Get link
- X
- Other Apps
By
Telanganadateline
-

హైదరాబాద్: మే 10 (ఈతరమ్): దేశంలో మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కనుమరుగు చేసే పాలకుల కుట్రలను తమ ఆందోళనలతో అడ్డుకుంటామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) సంఘాలు హెచ్చరించాయి. జర్నలిస్టుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణిని నిరసిస్తూ ఐజేయూ పిలుపు మేరకు జాతీయ స్థాయి "జర్నలిస్ట్స్ డిమాండ్స్ డే" కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు విద్యానగర్ లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు టీయుడబ్ల్యుజె ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్బంగా ఐజేయూ జాతీయ అధ్యక్షులుకే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం మీడియా రంగాన్ని విస్మరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం సహించారనిదన్నారు. దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలపై జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా, జర్నలిస్టులు హత్యలకు గురవుతున్నా కేంద్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం విచారకరమన్నారు. ఇందుక...